ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్..
ఏపీలో కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోంది.
ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు.
ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికో న్నత పాఠశాలలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ బూత్ నెంబర్ 284A లో చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని..
ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యతని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Related Web Stories
త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు
ఏపీకి కుంకీ ఏనుగులు
ఇసుక ఫ్రీ.. సీఎం ఆదేశాలు..
ఆపరేషన్ డెవిల్స్ హంట్ అంటూ బంగ్లాదేశ్లో కొత్త చర్యలు