రాయచోటి జిల్లా మార్పుపై కేబినెట్‌లో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు.

రాజంపేట వాళ్లు కూడా తాము రాయచోటిలో కలిసేది లేదని అంటుటున్నారని అన్నారు.

తనకు ఏం చేయాలనేది అర్థం కావటం లేదని పేర్కొన్నారు.

రాయచోటి గురించి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తనను గట్టిగా అడుగుతున్నారని తెలిపారు.

కానీ ఒక్క నియోజకవర్గాన్ని జిల్లాగా చేయలేం కదా అని ప్రశ్నించారు.

రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయిలో అభివృద్ధి చేద్దామని సూచించారు.

 రాయచోటి అభివృద్ధి బాధ్యత నాదేనని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.

పోలీస్ సబ్ డివిజన్ అంశంపై మరోసారి చర్చిద్దామని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆర్థిక స్థితిగతులు బాగోలేకపోయినా మనం బాగా పనిచేశామని చెప్పుకొచ్చారు.

2025లో 21 పథకాలు అమలు చేశామని వివరించారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

అధికారులందరూ కేబినెట్ భేటీకి సమయానికి ఉండాల్సిందేనని ఆదేశించారు.