మహిళల్లో వెన్నునొప్పి ఎందుకు
వస్తుందో తెలుసా?
స్త్రీలలో సర్వసాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. పురుషులతో పోల్చితే మహిళల్లో వెన్ననొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది.
దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు వెన్నునొప్పితో బాధపడుతుంటారు. అసలు మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందంటే..
మహిళలు ఎక్కువ సమయం , వంగి కూర్చొని పనులు ఎక్కువగా చేస్తుంటారు. ఈ కారణంగానే శరీరపు వెనుక కండరాలు నొప్పిని కలిగిస్తాయి.
కొందరు మహిళల్లో కిడ్నీ సమస్యల కారణంగా కూడా వెన్ను నొప్పి వస్తుంది. దీనిని పైలోనెఫ్రిటిస్ అని పిలుస్తారు.
మహిళల్లో నడుము నొప్పి రావడానికి మరో ప్రధాన కారణంలో ఎండోమెట్రియోసిస్ ఒకటి. ఇది స్త్రీ జననేంద్రియాలకు సంబంధించిన సమస్య..
ఈ సమస్యతో దీర్ఘకాలిక వెన్నునొప్పి తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా ఇది పీరియడ్స్ సమయంలో ఎక్కువువుతుంది.
మహిళలల్లో వచ్చే వెన్ననొప్పి సమస్యకు చెక్ పెట్టడంలో వేడి నీరు ఉపయోగపడుతుంది.
స్నానం చేసే సమయంలో వేడి నీటిని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గుతుంది.
Related Web Stories
వావ్.. పీనట్ బటర్ వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
కాల్చిన జామ చట్నీ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
30 ఏళ్లు దాటిన పురుషులకు ఈ లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి
ఈ చిట్కా పాటిస్తే.. 10 రోజుల్లోనే పట్టులాంటి కురులు..