వావ్.. పీనట్ బటర్ వల్ల
ఇన్ని ఉపయోగాలున్నాయా?
పీనట్ బటర్‌లో ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
పీనట్ బటర్ శాకాహారులకు ఓ మంచి ప్రోటీన్ సోర్స్. కండరాల మరమ్మత్తుకు, రోగ నిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది.
పీనట్ బటర్‌లో తగినంత ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మద్దతు ఇస్తుంది.
వేరుశెనగ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది మంచి ఆహారం. రక్తంలోకి ఒకేసారి ఎక్కువ గ్లూకోజ్ విడుదల కాదు.
పీనట్ బటర్‌ను దేనితో కలిపి తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
పీనట్ బటర్‌లో అమైనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆహారాన్ని కాపాడతాయి.
వేరు శెనగలో రెస్వెరాట్రాల్ సహా పలు యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుంచి కణాలను కాపాడతాయి.
పీనట్ బటర్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది. తద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పీనట్ బటర్‌లోని ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల కలయిక నిరంతరం శక్తిని విడుదల చేస్తుంది. దీనిని వ్యాయామానికి ముందు లేదా మధ్యాహ్నం స్నాక్‌గా తీసుకుంటే మంచిది.
Related Web Stories
కాల్చిన జామ చట్నీ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
30 ఏళ్లు దాటిన పురుషులకు ఈ లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి
ఈ చిట్కా పాటిస్తే.. 10 రోజుల్లోనే పట్టులాంటి కురులు..
ఆలు బోండా ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే..