కాల్చిన జామ చట్నీ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జామకాయను వంకాయ తరహాలో గ్యాస్ మంటపై తిప్పుతూ వేయించాలి. అందులో 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి వేయించాలి. ఆ తర్వాత జామకాయ, వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కారం, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సర్‌లో మెత్తగా రుబ్బుకోవాలి.

జాయకాయ చట్నీలో విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్- బి తదితర పోషకాలు ఉంటాయి.

ఈ చట్నీని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జామకాయలోని పొటాషియం, సోడియం.. రక్తపోటును నియంత్రిస్తుంది.

ఇందులోని ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయం చేస్తుంది.

మలబద్ధకంతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది.

కాల్చిన జామపండులో కాల్షియం, భాస్వరం ఉంటాయి. ఇవి ఎముకలకు చాలా మేలు చేస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.