వామ్మో..చుక్క నీరు తాగకున్నా హ్యాపీగా బతికేస్తాయంట..!

ప్రపంచవ్యాప్తంగా కొన్ని జీవులు నీరు లేకున్నా నెలల పాటు జీవించగలవు. 

ఒంటెలను 'ఎడారి ఓడలు' అని పిలుస్తారు. ఇవి నీరు లేకుండా అనేక వారాల పాటు జీవించగలవు. నీరు దొరికితే ఒకేసారి పెద్ద మొత్తంలో తాగేయగలవు.

ఎడారి తాబేళ్లు సంవత్సరం వరకు నీరు లేకుండా జీవించగలవు. శరీరం కదలికలను పరిమితం చేసుకుని మనుగడను కొనసాగిస్తాయి.

ఎడారిలో నివసించే చిన్న నక్కలు ఆహారం నుంచే తేమను పొందుతాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. నీరు లేకుండా జీవించగలవు. 

ఈ చిన్న ఎలుకలు నీరు లేకుండా కూడా జీవించగలవు. ఆహారంగా తీసుకునే విత్తనాల నుంచే అవసరమైన తేమను పొందుతాయి.

ఎడారిలో జింకలు నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించగలవు. అవి మొక్కల నుంచి పొందిన తేమపై ఆధారపడి ఉంటాయి. 

తేళ్లు చాలా నెలలు నీరు లేకుండా జీవించగలవు. వాటి జీవక్రియను మందగింప చేసుకుని తేమను నిల్వ చేసుకుంటాయి.

ఆఫ్రికన్ బుల్‌ఫ్రాగ్‌లు శరీరాలను మట్టిలో పాతిపెట్టి నిద్రలోకి జారుకోవడం ద్వారా నీటి అవసరాన్ని తగ్గించుకుంటాయి.