వరుసగా రెండు రోజుల పాటు ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఉపవాసం ఉండడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది కేలరీలు వేగంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

శరీరంలో మంట తగ్గడంతో పాటూ గుండె జబ్బులు, ఆర్థరైటిస్ తదితర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డుతుంది.

మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

పాడైన, చ‌నిపోయిన క‌ణాల స్థానంలో కొత్త క‌ణాలు ఏర్ప‌డతాయి.

ఉపవాసం ఉండాలనుకునే వారు డాక్టర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.