ఈ  చిట్కా పాటిస్తే.. 10 రోజుల్లోనే  పట్టులాంటి కురులు..

నేటి బిజీ బిజీ జీవిన విధానం.. ఆహారపు అలవాట్లు.. కాలుష్యం కారణంగా చిన్న వయస్సులోనే చాలా మందికి జుట్టు రాలిపోవడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది.

తెల్లబడిన జుట్టును తిరిగి నల్లగా మార్చేందుకు కూడా జనం నానా తంటాలు పడుతుంటారు. కొంత మంది డై, హెయిర్ కలర్ లాంటివి వాడుతుంటారు.

వాటిలో ఉపయోగించే కెమికల్స్ మీ జుట్టును మరింతగా పాడు చేస్తాయి. జుట్టు రాలిపోయే సమస్య కూడా మరింత తీవ్రం అవుతుంది.

తెల్ల జుట్టును సహాజ పద్ధతిలో నల్లగా మార్చేందుకు టీ పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది. టీ ఆకులలో టానిక్ యాసిడ్ ఉంటుంది.

ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు దోహదం చేస్తుంది. దీంతో మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ మంచి ఆరోగ్యవంతంగా మారుతుంది.

బ్లాక్‌ టీ తయారీ కోసం 2 కప్పుల నీటిలో 4-5 స్పూన్ల టీ పొడి వేసుకుని ఆ నీటిని బాగా మరిగించాలి.

చక్కటి డికాక్షన్‌ తయారైన తరువాత దానిని జుట్టుకు పట్టించి సుమారు అరగంట పాటు అలాగే ఉంచండి.

తరువాత సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు  (ఎబిఎన్ ఆంధ్రజ్యోతి) బాధ్యత వహించదు.