చలికాలం వచ్చేసింది అంటే వాతావరణంలో మార్పులు కారణంగా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి.

శిశువును వెచ్చగా ఉంచడానికి టోపీలు, సాక్స్, తగినంత దుస్తులు ధరించాలి. గది ఉష్ణోగ్రత కూడా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

శిశువు నిద్రపోయేటప్పుడు దుప్పటితో కప్పడం అస్సలు చేయకూడదు. దీనివల్ల SIDS (సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్) ప్రమాదం పెరుగుతుంది.

చలికాలంలో నవజాత శిశువులకు స్నానం చేయించేటప్పుడు కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

శిశువును ఎక్కువసేపు స్నానం చేయించకూడదు. స్నాన సమయాన్ని 2 నుండి 3 నిమిషాలలోపు పూర్తి చేయాలి. సువాసనగల సబ్బులను వాడటం మానుకోవాలి.

మీ బిడ్డను తాకే ముందు మీ చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ బిడ్డ నిద్రపోయే మరియు ఆడే ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి.

నవజాత శిశువులలో సమస్యలను గుర్తించడం కష్టం కాబట్టి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.