తిన్న వెంటనే టాయిలెట్‌కి వెళ్తున్నారా.. ఇది చిన్న విషయం కాదు!

కొంతమంది ఆహారం తిన్న వెంటనే టాయిలెట్‌కి వెళ్తుంటారు. పదే పదే ఇలా జరిగడం మంచిది కాదు.

భోజనం చేసిన వెంటనే టాయిలెట్‌కి వెళుతుంటే దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియలో సమస్యకు సంకేతం.

కొన్నిసార్లు అలెర్జీ కలిగించే ఆహారాలు లేదా సున్నితత్వం కారణంగా తిన్న తర్వాత టాయిలెట్‌కి వెళ్లాలని అనిపించవచ్చు.

అధికంగా కారం, ఫ్రై లేదా ఫాస్ట్ ఫుడ్ తినే వ్యక్తులకు ఈ సమస్య ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. 

ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశ వంటి మానసిక సమస్యలు ఉంటే తిన్న వెంటనే టాయిలెట్‌ రావచ్చు.  

కొన్నిసార్లు బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య వస్తుంది. 

తిన్న తర్వాత టాయిలెట్‌కి వెళ్లకూడదటే తేలికైన ఆహారం తీసుకోవాలి. రోజంతా తగినంత నీరు తాగాలి.