జుట్టు సమస్యలా..
బీర్‌తో చెక్ పెట్టిండిలా..
ఇటీవలి కాలంలో జుట్టు సమస్యలు చాలా సాధారణం అయ్యాయి.
చాలా మంది జుట్టు సంరక్షణ కోసం షాంపూలు, మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తారు.
కానీ బీరుతో తయారు చేసిన షాంపూ జుట్టు సమస్యలను తొలగించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా?
ఈ బీర్ షాంపులో ఉండే కాల్షియం, ఐరన్, ప్రోటీన్, సెలీనియం, విటమిన్ డి, విటమిన్ ఈ నిస్తేజంగా ఉన్న జుట్టును కాంతివంతంగా చేస్తుంది.
బీర్ షాంపూని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కుదుళ్లు బలంగా మారి, జుట్టు పొడవుగా పెరుగుతుంది.
చుండ్రు, దురద వంటి సమస్యలు ఉంటే.. బీర్ షాంపూని ఉపయోగించడం ప్రభావవంతంగా ఉంటుంది.
మీ జుట్టును నూనెతో మసాజ్ చేయండి. తర్వాత షాంపూ ఉపయోగించి కడిగేయండి. చివరగా బీర్‌ను కండిషనర్‌గా ఉపయోగించవచ్చు.
ఒక కప్పు బీర్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి తలపై, జుట్టు మూలాలపై అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ జుట్టును బాగా కడగాలి.
ఒక కంటైనర్‌లో ఒక కప్పు బీరు తీసుకొని పదిహేను నిమిషాలు బాగా మరిగించి, చల్లబరచండి. మీరు రోజూ ఉపయోగించే షాంపూను దానితో కలిపి నిల్వ చేయండి.
తల స్నానం చేసేటప్పుడు ఈ బీర్ షాంపూని ఉపయోగించవచ్చు.
ఇది సోషల్ మీడియా ఆధారిత సమాచారం. ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. జుట్టు సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Related Web Stories
14 రోజులు చక్కెర తినడం మానేస్తే.. జరిగే అద్భుతాలివే..
బ్యూటీఫుల్ పెయింటింగ్స్.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు..
మీ బ్లడ్ షుగర్ తగ్గాలంటే రాగి పిండి తీసుకోండి..
షాంపూతో తలస్నానం చేసే వారు ఈ తప్పులు అస్సలు చేయకుడి