జూబ్లీహిల్స్‌లోని కడారి ఆర్ట్ గ్యాలరీలో అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో పాటు నటుడు మాగంటి మురళీ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై జ్వోతి ప్రజల్వన చేశారు.

నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ మనస్సు ఉంటే మార్గం ఉంటుంది.. ఆలోచన ఉంటే ఆచరణ ఉంటుంది అనేలా అతి చిన్న వయసులోనే అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందిచదగ్గ విషయమని అన్నారు.

చిన్న వయసులోనే అనన్య అద్బుత ప్రదర్శన చూపిందని అభినందించారు.

చిత్రాలు ఇంత అద్భుతంగా ఉంటాయని తాను ఊహించలేదన్నారు.

భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రదర్శనలో 24 పెయింటింగ్స్‌ను ప్రదర్శించారు.

గత రెండేళ్లుగా తాను ఈ చిత్రాలను గీస్తున్నానని అనన్య తెలిపింది.

తాను ప్రస్తుతం 7వ తరతతి చదువుతన్నట్లు చిన్నారి అనన్య తెలిపింది.

అనన్యకు పెయింటింగ్‌లో శిక్షణ ఇచ్చిన ఉదయభాస్కర్ మాట్లాడుతూ చూసిన దృశ్యాన్ని ఎంతో అద్భుతంగా పెయింటింగ్ రూపంలో మార్చగల ప్రతిభ అనన్యలో ఉందన్నారు.

ఏకదాటిగా 4 గంటల పాటు కదలకుండా పెయింటింగ్ చేయగలదని చెప్పారు.

గ్యాలరీలోని పెయింటింగ్‌లను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు వేమూరి అనూష, కోగంటి శ్రుతి వీక్షించారు.

అధ్యాత్మికతతో పాటూ ప్రకృతి అందాలు ఉట్టిపడేలా ఉన్న చిన్నారి అనన్య పెయింటిగ్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

నాదెళ్ల అనన్య తల్లిదండ్రులు సందీప్, కావ్య, తాత, అమ్మమ్మ సుబ్బారావు, మాధవి, బొల్లినేని కృష్ణయ్య, చుక్కపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.