అప్పు ఇస్తున్నారా.. అయితే ఈ విషయం గుర్తుంచుకోండి..
సాధారణంగా ఎవరికైనా ఎప్పుడోఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భం వస్తుంది.
క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, చాలా మంది స్నేహితులు బంధువుల నుండి అప్పులు తీసుకుంటారు.
డబ్బు సకాలంలో తిరిగి చెల్లించకపోతే డిఫాల్ట్ కావడం సహజం. ఈ కారణంగా చాలా మంది అడిగిన వెంటనే డబ్బు అప్పుగా ఇచ్చేస్తారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తులో ఎవరైనా డబ్బు అడిగితే ఇలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వకండి..
గతంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ డబ్బు అడిగితే, అలాంటి వారికి అప్పు ఇవ్వకండి.
రుణం తిరిగి చెల్లించమని మీరు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడం చేస్తుంటారు. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకండి.
కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే స్నేహితులు, బంధువులు ఉన్నారనే విషయం గుర్తుకు వస్తుంది.
మిగతా అన్ని వేళల్లో మనం ఎవరో తెలియనట్లుగా అహంకారంతో ప్రవర్తిస్తారు.
ఇలా ప్రవర్తించే స్నేహితులు మీకు ఉన్నారా? అయితే ఇలాంటి వారు అప్పు అడిగితే, ఎప్పటికీ ఇవ్వకండి.
వాల సరదా కోసం అప్పు చేసే వారికి, డబ్బు వృధా చేసే వారికి మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు.
Related Web Stories
జుట్టు సమస్యలా.. బీర్తో చెక్ పెట్టిండిలా..
14 రోజులు చక్కెర తినడం మానేస్తే.. జరిగే అద్భుతాలివే..
బ్యూటీఫుల్ పెయింటింగ్స్.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు..
మీ బ్లడ్ షుగర్ తగ్గాలంటే రాగి పిండి తీసుకోండి..