చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం ఒకటి. అయితే చలి కాలం రాగానే చర్మం ఎందుకు పగులుతుందన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.?
వింటర్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చలి గాలుల తీవ్రత ఎక్కువుతుంది. దీంతో చర్మంలో తేమ తగ్గిపోతుంది. ఈ కారణంగా చర్మం పగులుతుంది.
చలికాలంలో సహజంగానే నీటిని తక్కువగా తీసుకుంటాం. ఇది డీహైడ్రేషన్ సమస్యకు దారి తీస్తుంది.
ఇక చలికారంణంగా వేడి నీటితో స్నానం చేస్తుంటం ఇది కూడా చర్మంలో సహజంగా ఉండే తేమ కోల్పోవడానికి కారణమవుతుంది. దీంతో చర్మంపై పగుళ్లు ఏర్పడుతాయి.
వాతావరణంలోని చల్లని గాలి శరీరంలో ఉన్న తేమను పీల్చుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మం బలహీనంగా మారడానికి కారణమవుతుంది.
శరీరంలో విటమిన్ ఎ,సి,డి లోపం వల్ల కూడా స్కిన్ పగులుతుంది. వింటర్‌లో ఎండ తక్కువగా ఉండడం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా చెబుతుంటారు.
చలికాలంలో సబ్బులకు బదులుగా శనగపిండిని ఉపయోగించాలి. శనగపిండిలో పాలు కలుపుకుని శరీరానికి అప్లై చేసుకుంటే చర్మం స్మూత్‌గా మారుతుంది.
ఎంత చలిగా ఉన్న గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
పుట్టగొడుగుల కాఫీ తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే చాలు
పచ్చిమిర్చి నెల రోజుల పాటు తాజాగా ఉండాలంటే..
రోజుకు ఆరు వేల అడుగులు.. మీ శరీరానికి ఏం జరుగుతుందంటే..