వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. సాధారణంగా ఇవి లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు.

పచ్చి మిరపకాయలు ఎక్కువ కాలం తాజగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?  సింపుల్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందాం...   

  ముందుగా పచ్చిమిర్చిని కొనుగోలు చేసేటప్పుడు ముడతలు, మచ్చలు లేకుండా తాజాగా ఉన్నవాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

పచ్చి మిరపకాయలు తాజాగా ఉండాలంటే, వాటిని శుభ్రంగా కడిగి, కాడలు తీసి, బాగా ఆరబెట్టాలి.

 ఆ తర్వాత టిష్యూ పేపర్‌లో చుట్టి లేదా గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

ఒక నెల వరకు పచ్చి మిరపకాయలను తాజాగా ఉంచుకోవాలనుకుంటే మిరపకాయలను బాగా కడిగి, శుభ్రం చేసి, ఆరబెట్టి, రిఫ్రిజిరేటర్‌లోని కూరగాయల ట్రేలో జిప్‌లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయండి.

పచ్చి మిరపకాయల నుండి కాండం తీసి, కడిగి శుభ్రం చేసి, పొడిగా తుడవండి. తర్వాత వాటిని న్యూస్‌పేపర్‌లో చుట్టి ఫ్రిజ్ తలుపులో నిల్వ చేయండి.

ఈ పద్ధతిని పాటించడం వల్ల పచ్చిమిరపకాయలు నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి.