స్త్రీలకు అందంపై మక్కువ ఎక్కువ. ఆ అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు.
స్త్రీల అందంలో కళ్లు కూడా ఒకటి. ఆ కళ్లను మరింత అందంగా మార్చేందుకు కళ్లకు కాటుక, ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
చాలా మందికి ఐ లైనర్స్ ని ఎలా వాడాలో తెలీదు.. అలాగే ఎలా రిమూవ్ చేయాలో కూడా తెలీదు. ఇష్టానుసారంగా వాడుతూ ఉంటారు.
దీంతో కళ్లు మసక బారినట్లు ఉండటం, కళ్ల కింద మండటం, కళ్లల్లో మంట వంటి ప్రమాదాలు వస్తాయి.
కాజల్ , లైనర్‌లోని రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. మనం వీటిని రోజూ ఉపయోగించడం వల్ల కంటి అలెర్జీలు, చికాకు , వాపుకు దారితీస్తుంది.
నేత్ర వైద్య నిపుణులు ప్రతిరోజూ కాటుక వాడటం వల్ల కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు.
రసాయన కాటుక కణాలు కళ్లలోకి ప్రవేశిస్తే, అలర్జీలకు కారణమవుతాయి. అలర్జీల వల్ల దురద, కళ్ళు ఉబ్బడం లేదా కళ్ల చుట్టూ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
కళ్లకు పెట్టుకునే కాటుక ఎప్పుడూ మంచి నాణ్యమైన కాటుకను ఉపయోగించండి. పాత కాటుకను ఉపయోగించకుండా ఉండండి. ఎవరితోనూ కాటుకను పంచుకోవద్దు. కళ్ళలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.