పుట్టగొడుగుల కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

చాగా, లయన్స్ మేన్, రీషి తదితర ప్రత్యేకమైన పుట్టగొడుగుల నుంచి కాఫీని తయారు చేస్తారు.

సాధారణ కాఫీతో పోలిస్తే.. ఇందులో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పుట్టగొడుగులు, కాఫీ గింజల పొడితే చేసే ఈ కాఫీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఇందులోని విటమిన్లు, పొటాషియం, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

మంచి బ్యాక్టీరియాను పెంచడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

మూత్రపిండాలు, జీర్ణ సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండడం మంచిది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.