విదేశాల్లో ఉండగా  పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు  ఏం చేయాలంటే..

విదేశీ ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా భద్ర పరుచుకోవాల్సిన డాక్యుమెంట్స్‌లో పాస్‌పోర్టు ప్రధానమైనది.

కానీ ఒక్కోసారి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పాస్‌పోర్టు పోగొట్టుకోవాల్సి రావొచ్చు.

అయితే, ఈ సమస్య నుంచి బయట పడేందుకు పలు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పాస్ పోర్టు పోయిందనగానే కంగారు పడిపోవద్దు. ఎక్కడ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలి.

ముందుగా మీరుంటున్న హోటల్ గదిలో క్షుణ్ణంగా వెతకాలి బ్యాగులు, జేబులు మరేచోట అయినా పెట్టామేమో గుర్తు తెచ్చుకుని వెతకాలి.

ఎంత వెతికినా దొరకలేదని అనుకుంటే వెంటనే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలి. 

ఎంబసీ వ్యవహారాలు చక్కబెట్టే సమయంలో పోలీసు రిపోర్టు అక్కరకు వస్తుంది.

విదేశాల్లో ఉన్నప్పుడు పాస్‌పోర్టు పోతే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అత్యవసరం. 

ఇక పాస్‌పోర్టు పోయిన విషయాన్ని అక్కడి భారతీయ ఎంబసీకి కూడా సమాచారం అందించాలి. 

ఎంబసీ వెబ్‌సైట్ సంప్రదిస్తే  ఈ విషయాలు తెలుస్తాయి.