పొడి చర్మం అనేది చాలా  మందిని ఇబ్బంది పెట్టే సమస్య.

పొడి చర్మం ఉన్న వారు మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలి.

పొడి చర్మం ఉన్నవారు సల్ఫేట్‌లు లేదా ఆల్కహాల్ లేని మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌లను వాడాలి.

వేడి నీటి స్నానాలు చర్మం నుండి సహజ నూనెలను తొలగించి, స్కిన్ పొడిగా చేస్తాయి. అందుకే గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి

రాత్రిపూట పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి

పొడి చర్మం కోసం ప్రత్యేకంగా రూపొందించిన నైట్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్‌ను వాడండి.

చలి, గాలి, సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించుకోండి.

బయటికి వెళ్ళినప్పుడు పొడి చర్మం ఉన్నవారు సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా వాడాలి.

రోజుకు తగినంత నీరు తాగడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. అందుకే ప్రతి రోజు 2- 3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి.