ఈ టిప్స్ పాటిస్తే..  మీ దగ్గర డబ్బే డబ్బు..

డబ్బు ఎలా పొదుపు చేయాలనేదానిపై మీరు కనుక కసరత్తు చేస్తుంటే.. బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవడం అందులో మొదటి అడుగుగా ఉండాలి. 

నెలలో చెల్లింపుల మొత్తం ఎంతో అంచనా వేయండి. ఆ తర్వాత మీ వద్ద ఎంత మిగులుతుందనేది మీకే అర్థమైపోతుంది. 

మనీ సేవింగ్ విషయంలో మీ డబ్బు ఎక్కువగా ఎక్కడ ఖర్చవుతుందనే విషయాన్ని ఒకసారి పరిశీలించుకోండి.

ఒకవేళ మీకు శాలరీ అకౌంట్ ఉంటే వడ్డీ చెల్లింపులు, నెలవారీ ఈఐఎం చెల్లింపులను ఆటోమేటిక్ సేవింగ్స్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడం మంచిది. 

కొనుగోలు విషయంలో అవసరమైన వస్తువులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

మనీ సేవింగ్ చేయాలనే ప్రణాళిక ఉన్నప్పుడు పెట్టుబడుల పెట్టేందుకు అన్వేషణ చేయాలి. ఇన్వెస్ట్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి.