Weight Loss: బరువు తగ్గడానికి 30-30-30 రూల్..!

ఆరోగ్యకరంగా బరువు తగ్గించడంలో  30-30-30 రూల్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. 

30-30-30 రూల్ అంటే ఉదయం నిద్ర లేచిన అరగంట లోపు 30 గ్రాముల ప్రోటీన్‌ను తినాలట. అనంతరం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలట. 

ప్రోటీన్ శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియెంట్. ఇది జీవక్రియను పెంచి ఆకలిని నియంత్రిస్తుంది. 

వ్యాయామంలో నడక, యోగా, స్ట్రెచ్ వర్కౌట్స్, తేలికపాటి కార్డియో వ్యాయామాలు చేయాలి. క్యాలరీలను బర్న్ చేస్తాయి. 

ఉదయాన్నే తీసుకునే ప్రోటీన్ మెటబాలిజమ్‌ను పెంచి రోజంతా కేలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది.

ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

30-30-30 రూల్‌ను పాటించడం సులభం కావడంతో దీనిని దీర్ఘకాలం కొనసాగించవచ్చు.  ఈరూల్‌లో కఠినమైన డైట్, భారీ వ్యాయామం అవసరం లేదు. 

నడక, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు మరింత శక్తిని పొందుతాయి. 

30 గ్రాముల ప్రోటీన్ కోసం, గుడ్లు, పెరుగు, కాటేజ్ చీజ్, పీనట్ బటర్, ప్రోటీన్ షేక్స్ లేదా చియా విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాల్ని తినండి.