ఈ చిట్కాలతో.. కొబ్బరి చిప్ప నుంచి  కొబ్బరిని ఈజీగా వేరుచేయచ్చు..

కొబ్బరికాయలో నుంచి కొబ్బరి చిప్పని వేరు చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. 

ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలోనే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని నీట్‌గా విడదీయవచ్చు.

కొబ్బరికాయ చుట్టూ ఉన్న పీచును తీసేసి 30 నుంచి 40 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

 తర్వాత ఏదైనా బరువైన సుత్తి లేదా రాయి తీసుకుని కొబ్బరికాయను మధ్యలో పగులగొట్టండి. అప్పుడు సులువుగా పెంకు నుంచి కొబ్బరి చిప్ప విడిపోతుంది.

ఒకవేళ ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే కొబ్బరికాయను అరగంటపాటు వేడినీళ్లలో ఉంచి పగులగొడితే ముక్కలు కాకుండానే కొబ్బరి సులువుగా వేరవుతుంది.

కొబ్బరికాయను స్టవ్ మీద పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కాల్చండి. ఇలా చేసినా కొబ్బరిని ఈజీగా తొలగించవచ్చు.