నోరూరించే  చింతచిగురు వంకాయ కూర..  ఎప్పుడైనా ఇలా చేశారా..

కావలసిన పదార్థాలు: చింతచిగురు - 1కప్పు, వంకాయలు - 6, ఉల్లిపాయ -1,

పసుపు - చిటికెడు, ఎండుకొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత,

 కారం - 1 టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2, తాలింపు దినుసులు - సరిపడా.

తయారుచేసే విధానం: చిగురును శుభ్రం చేసి కడిగి, ఆరబెట్టాలి. 

చిగురు, ఎండుకొబ్బరి తురుము, కారం, వెల్లుల్లి రేకలు, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

నూనెలో తాలింపు దినుసులు, ఉల్లితరుగు వేగించాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు, పసుపు వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి.

చిగురు పేస్టు వేసి ముక్కలకు పట్టేలా కలిపి, చిక్కబడ్డాక దించేయాలి. వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది.