నిద్ర సరిపోనప్పుడు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

నిద్ర తక్కువైతే ఆకలికి కారణమయ్యే హార్మోన్లు విడుదలై జంక్ ఫుడ్స్ వైపు మనసు మళ్లుతుంది. 

భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి చీటికీమాటికీ చిరాకు కలుగుతుంది

నిద్ర ద్వారా మెదడుకు కావాల్సిన రెస్టు దొరక్కపోతే మతిమరుపు ఎక్కువవుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది.

శారీరక కదలికలు, ఆలోచనల్లో చురుకుదనం తగ్గుతుంది. 

నిద్ర లేకపోవడంతో రోగనిరోధక శక్తి బలహీనపడి నిత్యం అనారోగ్యాలు వేధిస్తుంటాయి

చర్మం నిగారింపు తగ్గి వయసు మీద పడినట్టు కనిపిస్తారు.

గుండె చలనం, బీపీలో మార్పులు ఎక్కువవుతాయి