ఆధునిక జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రశాంతత కోసం కొన్ని టిప్స్ పాటించాలి

రోజూ కనీసం 5 నిమిషాలు ధ్యానం చేయాలి. దీంతో, ఆందోళన తగ్గి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. 

మనకు జీవితంలో లభించిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. లేని వాటి గురించి ఆలోచించొద్దు

ఇంటి లోపల, పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది మనసును శాంతపరుస్తుంది. 

సోషల్ మీడియాపై నుంచి దృష్టి మరల్చాలి. పుస్తకపఠనం వైపు మళ్లాలి.

మనసులోని ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వాలి. అప్పుడే మనసుపై బరువు తగ్గి సాంత్వన లభిస్తుంది

చెట్లు, పూల మొక్కలు, ఇతర ప్రకృతి అందాలను చూస్తూ గడపడం కూడా మనసును తేలికపరుస్తుంది.