ఆల్కహాల్‌ తీసుకుంటే.. వాంతులు  ఎందుకు అవుతాయో తెలుసా.?

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మద్యం ప్రియులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు.

మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండె మొదలు లివర్‌ వరకు శరీరంలోని అన్ని భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో సేవించేటప్పుడు అది పాయిజనింగ్‌గా మారుతుంది. ఇది బయటకు వచ్చే టైంలో వాంతులు అవుతాయి

మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై వాంతులు వస్తాయి.

తాగి జర్నీ చేయడం వల్ల కడుపులో తిప్పి వాంతులు అవుతాయి.

వేగంగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఒత్తిడి పెరిగి వాంతులు అవుతాయి.

ఉదయం నుంచి అహరం తిసుకోకుండా మద్యం సేవిస్తే వాంతులు అవుతాయి.

రకారకాల బ్రాండ్లను కలిపి తాగడంవల్ల కూడా వాంతులు అవుతాయి

జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు మద్యం ఎక్కువ తీసుకున్నా వాంతులు అవుతాయి

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. మద్యం సేవించిన తర్వాత ఇబ్బందిగా అనిపిస్తే సమీపంలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి.