టీ ఎక్కువ తాగితే ఈ రోగాలు తప్పవంట!
టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా టీ తాగుతుంటారు.
టీ తాగడం మంచిదే అయినప్పటికీ అతిగా తాగడం వలన అనేక రకాలైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదంట.
వర్షకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉండటంతో చాలా మంది ఎక్కువగా టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు
ఎక్కువగా టీ తాగడం వలన కొందరిలో తల తిరగం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు ఎక్కువవుతాయని చెబుతున్నారు నిపుణులు.
టీ తాగడం వలన కొన్ని సార్లు ఇది శరీరంలోని అనేక సమస్యలకు కారణం అవుతుంది. మరీ ముఖ్యంగా చేతులు వణకడం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయంట.
పరగడుపున టీ తాగడం వలన ఇది జీర్ణక్రియ సమస్యలను తీసుకొస్తుంది.అలాగే టీ అధికంగా తాగడం వలన ఎముకలు బలహీన పడుతాయంట.
ఎక్కువగా టీ తాగడం వలన ఆందోళన పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, రక్త పోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయంట
వీలైనంత వరకు టీని తక్కువ మొతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Related Web Stories
ఈ కాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి
జుట్టుకు హెన్నా అప్లై చేసేముందు ఈ మిస్టేక్స్ చేస్తే మొదటికే మోసం!
బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగితే జరిగేది ఇదే..
మీరు వాడుతోన్న పసుపు అసలా, నకిలీనా.? ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి