పసుపు అసలా, నకిలీనా.? ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి
పసుపులో ఎంతటి ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
కొందరు అడ్డదారిలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా నకిలీ పసుపు తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న పసుపు నిజమైందా.? నకిలీదా.? తెలుసుకునేందుకు కోన్ని సింపుల్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. అనంతరం అందులో చెంచా పసుపును వేయాలి. తర్వాత బాగా కలపాలి. ఒకవేళ పూర్తిగా కరిగిపోతే..
అది మంచి పసుపుగా పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా గ్లాసు చివరిలో చేరితో అది నకిలీదని అర్థం
కల్తీ పసుపు అయితే నీటి రంగు ముదురుగా ఉంటుంది. అరచేతిలో చిటికెడు పసుపు వేసి బొటన వేలుతో కొద్ది సేపు రుద్దండి,
ఒకవేళ పసుపు అసలు అయితే చేతికి ఎలాంటి మరక అంటదు. లేదంటే అందులో ఏదో రంగు కలిపారని అర్థం.
కొంచెం పసుపును నీటిలో కలిపి.. అందులో సబ్బు నురుగు కలపండి. పసుపు రంగు మరింత ముదురుగా మారితే అందులో కల్తీ ఉండవచ్చు. అసలైన పసుపు రంగు నురుగుతో పెద్దగా మారదు.
పసుపులో నిమ్మరసం కొన్ని చుక్కలు వేయండి. నురగ లేదా బుడగలు వస్తే.. అది కచ్చితంగా కల్తీనే. నిజమైన పసుపుపై నిమ్మరసం ప్రభావం చూపించదు.