నిమ్మకాయ మన వంటగదిలో అత్యంత అవసరమైన వస్తువులలో ఒకటి.

చాలా మంది ఒకేసారి చాలా నిమ్మకాయలు కొని ఫ్రిజ్‌లో ఉంచుతారు.

ఇలా చేసినా అవి ఎక్కువ కాలం తాజాగా ఉండవు.

ఒక సాధారణ సలహా పాటిస్తే నిమ్మకాయలు 6 నెలల వరకు తాజాగా ఉంటాయంటున్నారు నిపుణులు.

మనం ప్రతిరోజూ ఉపయోగించే నూనె ప్యాకెట్లలో కొంత నూనె మిగిలి ఉంటుంది.

తాజా నిమ్మకాయలను తీసుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టండి.

తేమ ఉండకూడదు. ఎండిన నిమ్మకాయలను ఒక నూనె ప్యాకెట్‌లో వేసి పైభాగాన్ని గట్టిగా మూసివేయాలి.

వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి ప్యాకెట్‌లో మిగిలి ఉన్న నూనె నిమ్మకాయలపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది.

6 నెలల వరకు తాజాగా ఉంటాయి నిమ్మకాయాలు