ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గుడ్డైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు
గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాడైపోయిన గుడ్లను వాసన ద్వారా గుర్తించవచ్చు. ఒక పాత్రలో గుడ్డు పగులగొట్టి వాసన చూడండి. చెడు వాసన వస్తున్నట్లయితే మాత్రం ఆ గుడ్లు పాడైపోయినట్లే.
గుడ్డు నీటిలో మునిగినట్లయితే అది మంచిగా ఉన్నట్లే. ఒకవేళ గుడ్డు నీటితో తేలితే మాత్రం అది పాడైపోయినట్లే నని భావించాలి
చెవి దగ్గర డ్డును ఉంచుకుని షేక్ చేయాలి. రెగ్యులర్‌గా కాకుండా గుడ్డు నుంచి శబ్దాలు వస్తుంటే మాత్రం అది పాడైపోయినట్లేనని గ్రహించాలి.
ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేసి, గుడ్డును లైట్ పైన ఉంచాలి లోపల నుండి పసుపు రంగుతో మెరుస్తుంటే అది తాజాగా ఉందని,తక్కువ లేదా వెలుతురు లేకపోతే, ఆ గుడ్డు చెడిపోయిందని సంకేతం