కలలో పక్షులు కనిపిస్తున్నాయా..కనిపిస్తే  ఏ అర్ధమో తెలుసా..

కలలో కాకి, పావురం, చిలుక కనిపిస్తే ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కలలో కాకి కనిపిస్తే రాబోయే మార్పుల గురించి సూచనగా భావించవచ్చు. ఈ మార్పులు మీరు ఊహించని విధంగా ఉండొచ్చు.

ఒకవేళ మీ కలలో కాకి మాట్లాడుతుంటే.. మీరు దాచిన ఒక విషయం తొందర్లోనే బయటపడుతుంది అని అర్థం.

తెల్ల పావురం కలలో కనిపిస్తే అది మీ జీవితంలో శుభ సంఘటనలు జరగబోతున్నాయని సూచిస్తుంది.

కలలో చిలుక కనిపిస్తే మీరు మీ మనసులో ఉన్న విషయాలను వేరే వాళ్లకు సరిగ్గా చెప్పలేకపోతున్నారని అర్థం చేసుకోవచ్చు.

రంగురంగుల చిలుక కనిపిస్తే.. మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉన్నారని, కొత్త పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం.

కలలో గాయపడిన పావురం కనిపిస్తే.. అది ఎవరితోనైనా మీరు భావోద్వేగంగా దూరంగా ఉన్నారని తెలియజేస్తుంది.

కొన్నిసార్లు కలలు మన మనసులో ఉన్న విషయాల వల్ల వస్తాయి. అవి నిజమైన సూచనల్లా అనిపించినా.. వాటిని పూర్తిగా నమ్మడం కరెక్ట్ కాదు.