10 నిమిషాల్లో జిలేబి ని ఇంట్లోనే చాలా
ఈజీ గా చేసుకోవచ్చు
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ శనగ పిండి, 1 కప్పు తాజా పెరుగు, 1 కప్పు చక్కెర, 4 కప్పుల నీళ్లు, ఒక కప్పు నెయ్యి
ఒక బౌల్‌లోకి మైదా పిండిని తీసుకోని దానికి శనగపిండి, తాజా పెరుగు కలిపి ఉండలు రాకుండా పేస్ట్‌గా కలుపుకోవాలి.
ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి స్టౌవ్ మీద పాన్ పెట్టి పంచదార వేయాలి.
పంచదారలో నీరు పోసి పాకం వచ్చేంత వరకు కలుపుతూ వేడి చెయ్యాలి. దీంట్లోకి కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు.
మరో స్టౌవ్‌పై బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యిని వేసి నెమ్మదిగా జిలేబి ఆకారం వచ్చేలా నూనెలో వేయాలి.
రెండు వైపుల గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. చివరిగా ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో జిలేబిలను కొద్ది సేపు ఉంచితే సరి
వేడి వేడిగా రుచికరమైన జిలేబిలు రేడీ.
Related Web Stories
ఆ అలవాట్లు.. మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి
రాత్రి పూట స్నానం చేసే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..
ఈ నూనెతో తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే! ఓసారి ట్రై చేసి చూడండి..!
మీ చర్మం యవ్వనంగా మెరిసిపోవాలంటే ఈ సీక్రెట్ ఫాలో అవ్వండి