ఈ నూనెతో తెల్ల జుట్టు నల్లగా  మారాల్సిందే! ఓసారి ట్రై చేసి చూడండి..!

కొబ్బరి నూనెలో గోరింటాకులు వేసి బాగా మరిగించి.. చల్లారాక వడగట్టి తలకు రాస్తే జుట్టు బలంగా మారుతుంది.

 ఈ నూనె తల చర్మానికి తడినిస్తుంది.. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. నెమ్మదిగా జుట్టు నల్లగా మారే అవకాశం కూడా ఉంది.

కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి మరిగించి.. చల్లారాక వడగట్టి తలకు రాస్తే జుట్టు నల్లగా మెరుస్తుంది..

జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది  తల చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.

కొబ్బరి నూనెలో తులసి ఆకులు వేసి మరిగించి.. చల్లారాక వడగట్టి వాడితే తలపై ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

  కొబ్బరి నూనెలో పుదీనా ఆకులు వేసి మరిగించి.. చల్లారిన తర్వాత వడగట్టి తలకు రాసుకుంటే వేసవిలో తల వేడెక్కడం తగ్గుతుంది.

ఈ ఆకులన్నింటినీ వాడే ముందు కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నూనెను వడగట్టి ఉపయోగించాలి.

పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి.