పిల్లలకు కథలు  చెప్పడం వల్ల ఎన్ని లాభాలో..

సాధారణంగా పిల్లలు నిద్రపోయే ముందు ఫోన్ లేదా వీడియో గేమ్స్ ఆడేందుకు ఇష్టపడతారు.

దీనివల్ల వారికి ఆలస్యంగా నిద్ర వస్తుంది. అదే సమయంలో నిద్రలేకపోవడం కూడా మొదలవుతుంది.

అదే పడుకోవడానికి రెండు గంటల ముందు నుంచి పిల్లలు కథలు, కబుర్లతో సమయం గడిపితే త్వరగా, గాఢమైన నిద్రలోకి జారుకుంటారు.

కథలు చెప్పడం వల్ల  పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది.

కథలు చెప్పేటప్పుడు పిల్లల ధ్యాస అంతా కేవలం కథపైనే ఉండాలి. రోజూ కథలు వినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత శక్తి పెరుగుతుంది.

కథలు చెప్పేటప్పుడు పిల్లలు కథలోని అన్ని అంశాలను తీసుకుంటారు. అలాగే పిల్లలు ఈ కథల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు.

పిల్లలకు కథలు చెప్పడం వల్ల  వాళ్ళల్లో ఆలోచనా శక్తితోపాటు ఊహాశక్తి కూడా పెరుగుతుంది.