తేలు కరిస్తే వెంటనే ఇలా చేయండి..  లేదంటే ప్రమాదమే!

ప్రతి ఏటా దాదాపు 3,000 మంది తేలు కాటుతో చనిపోతున్నారు. ఇందులో చిన్నపిల్లలే 80 శాతం మంది వరకు ఉండటం గమనార్హం

తేలు మనుషులపై కావాలని దాడి చేయదు. దానికి ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే కుడుతుంది.  

తేలు కాటుకు గురైన వ్యక్తికి ఒక్కసారిగా శరీరంలో మార్పులు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.

కండరాల నొప్పులు, నిద్రలేమి, కళ్ళు అదరడం, ఆందోళన, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

తేలు కుట్టిన వెంటనే నొప్పి తగ్గడం కోసం ఆ ప్రాంతాన్ని బట్టతో కట్టాలి.

విషం శరీరం అంతటా వేగంగా వ్యాపించకుండా నిరోధించడానికి కదలికలను తగ్గించాలి.

ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కాటు వేసిన ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి.

తేలు కాటు తర్వాత అధిక జ్వరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.