మీ బరువును, షుగర్‌ను తగ్గించే.. సూపర్ డ్రింక్స్ ఇవే.. 

బరువును తగ్గించడంలో కొన్ని హెర్బల్ డ్రింక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అవేంటో చూద్దాం..

దాల్చిన చెక్క, తేనెను నీటితో కలిపి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి కొవ్వు కరుగుతుంది. 

పరగడుపునే వేడి నీటితో నిమ్మ రసం, తేనె కలిపి తీసుకుంటే కొవ్వు కరుగుతుంది. 

సోంపు కలిపిన నీళ్లు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. 

కీరదోస, పుదీనా జ్యూస్ శరీరంలోని హానికర టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. 

పసుపు కలిపిన పాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో ఉంచుతాయి. 

గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజమ్ వేగవంతమవుతుంది. 

ఉసిరి రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి, కొవ్వును కరిగిస్తాయి. 

అల్లం టీ ఆకలిని నియంత్రించి కొవ్వు కరిగేలా చేస్తుంది.