వర్షాకాలంలో ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా.? ఇలా చేయండి..

 ఇంట్లో లభించే సహజ పదార్థాలతోనే ఈగలకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ ఆటిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈగలు ఎక్కువగా వాలే చోట ఉప్పు, పసుపు కొంత నీరు మిక్స్‌ చేసి స్ప్రే చేస్తే ఈగలు పరార్‌ అవుతాయి.

 నీటిని  మరిగించి. అందులో ఉప్పు, మిరియాల పొడిని వేసి ఈగలు, దోమలు వచ్చే చోట స్ప్రే చేయాలి. దీంతో ఈగలు అటువైపు రావు.

 నారింజ తొక్కలను ఒక క్లాత్‌లో కట్టి వంట గదిలో వేలాడదీయాలి. ఇలా చేసినా ఈగలు రాకుండా ఉంటాయి.

ఇంట్లో కర్పూరం వెలిగించి గదుల్లో పొగ వ్యాపించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఈగలు పారిపోతాయి.

తులసి, పుదీనా గ్రైండ్‌ చేసి పేస్ట్‌లా చేసి అందులో కొన్ని నీళ్లు పోసి బాటిల్‌లో తీసుకోండి. దీనిని ఈగలు వచ్చే చోట స్ప్రే చేయండి.