బోటి కర్రీ ఇలా వండారంటే..  టేస్ట్ అదిరిపోవాల్సిందే..

ముందుగా టొమాటా, ఉల్లిపాయలను మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 

తర్వాత ఓవెన్‌లో ఒక బౌల్‍లో నూనె పోసి జీలకర్ర, మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, ఇంగువ, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలా ఒక్కొక్కటిగా వేసి బాగా వేయించాలి.

ఒక కప్పు నీళ్ళు పోసి వాటిని బాగా గ్రైండ్ చేసి విడిగా ఉంచుకోవాలి.

కాసేపు తర్వాత ఓవెన్‌లో కుక్కర్‌ పెట్టి అందులో కడిగిన మేక పేగులను, ముందుగా రుబ్బిన టమాటా, 

ఉల్లి ముద్ద‍లను, రుబ్బిన మసాలా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌ను మూతపెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.

తర్వాత ఓవెన్‍లో కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కర్వేపాకు వేసి రంగు మారే వరకు వేయించాలి.

తర్వాత ఉడకబెట్టిన పేగులను కడాయిలో వేసి చిన్న మంట మీద ఉంచి 5 నిమిషాలు వరకు ఉడకబెట్టి కొత్తిమీర చల్లితే రుచికరమైన బోటి కూర రెడీ అవుతుంది