కొన్ని అలవాట్లు ఉంటే రోగ నిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కంటి నిండా నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తిపై నియంత్రణ తగ్గుతుంది. వ్యాధులను పూర్తిస్థాయిలో ఎదుర్కోలేరు

తేలికపాటి కసరత్తులు కూడా చేయని వారి రోగ నిరోధక శక్తి క్రమంగా వీకవుతుంది

పోషకాహారానికి బదులు ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఆహారాలు తినే వారు కూడా బలహీనంగా మారతారు

అధిక ఒత్తిడి కారణంగా ఇన్‌ఫ్లమేషన్ పెరిగి ఇమ్యూనిటీ బలహీనం అవుతుంది.

మద్యపానం అలవాటు ఉన్న వారు చేజేతులా తమ రోగ నిరోధక శక్తిని బలహీనపరుచుకుంటారు.

ఈ అలవాట్లను తక్షణం వదిలించుకుంటే రోగ నిరోధక శక్తి తిరిగి బలోపేతం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.