క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆత్మవిశ్వాసం అదే అలవడుతుంది

ఆత్మవిశ్వాసం పెంపొందించుకో దలిస్తే ముందుగా ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి

ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్లాలి. వ్యక్తిత్వంలో మార్పు ఒక్కసారిగా రాదన్న విషయాన్ని గ్రహించాలి.

వ్యక్తులు తమ అభిరుచికి తగ్గట్టు సంతోషం కలిగించే పనుల్లో నిమగ్నం కావాలి

అవతలి వారి పొగడ్తలు మన ప్రతిభకు కొలమానం కాదన్న విషయాన్ని గుర్తించాలి

మీ అవసరాలు, ఇష్టాఇష్టాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ అవతలి వారికి సందర్భోచితంగా నో చెప్పాలి.

పొగడ్తలను హుందాగా స్వీకరించాలి. మన సామర్థ్యంపై మనకు నమ్మకం పెంచుకోవాలి

ఆ రోజు ఎదురైన అనుభవాలను సమీక్షించుకుని మరుసటి రోజు కొత్తగా ప్రారంభించాలి.