టేస్టీ టేస్టీ బొమ్మిడాయిల పులుసు.. ఇలా చేశారంటే అదుర్స్!
కావాల్సిన పదార్థాలు: బొమ్మిడాయిలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉఫ్పు, పసుపు, చింత పండు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్.
చిన్న చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
చింత పండులో నీళ్లు వేసి నానబెట్టాలి. ఆ తర్వాత కర్రీ చేసే పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి.
కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాక.. నెక్ట్స్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేయాలి
కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి మొత్తం ఫ్రై చేయాలి.
చేప ముక్కలు వేసి చిన్న మంట మీద ఓ ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి.
చేప ముక్కలు వేగాక నీళ్లు వేసి ఓ ఉడుకు వచ్చాక.. చింత పండు పులుసు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి
చివరగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బొమ్మిడాయిల పులుసు సిద్ధం.
Related Web Stories
2025 పద్మ పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థులు ఎవరో తెలుసుకుందాం
పద్మ శ్రీ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
మనుషుల్లో రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా..?
ఈ టేస్టీ పాలకూర చికెన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..