ఈ టేస్టీ పాలకూర చికెన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
కావాల్సిన పదార్థాలు: పాలకూర, చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆయిల్.
చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి.
కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి.
ఓ కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసిన పాలకూర, పచ్చి మిర్చి వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి.
చల్లారాక మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి.
ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి.
ఇవి ఫ్రై అయ్యాక.. ఉల్లిపాయలు, కొన్ని పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి.
ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి ఓ నిమిషం ఫ్రై చేశాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసి.. ఓ పది నిమిషాలు ఉడికించాలి.
చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి ఓ ఉడుకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పాలక్ చికెన్ కర్రీ సిద్ధం.
Related Web Stories
మిల్లెట్స్ vs ప్రోటీన్ పౌడర్: రెండింటిలో ఏవి మంచివి?
ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ డీ లోపం ఉన్నట్టే!
భారతీయులు వీసా లేకుండానే వెళ్ళగలిగే దేశాలు ఇవే..
ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా...