థర్మోస్ బాటిల్స్ ఈ మధ్య కాలంలో చాలామంది వాడుతున్నారు.

అయితే వీటిలో వేడి ఎక్కువ సేపు ఉంటుంది.  కానీ ఈ బాటిల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది తప్పదు.

సరిగా క్లీన్ చేయని బాటిల్స్ మురికి వాసనేస్తూ ఉంటాయి.

దీనికి సరైన పరిష్కారం గురించి తెలుసుకుందాం.

మొదటిగా అరకప్పు వైట్ వెనిగర్ వేసి, దానిపై 1 టీస్పూన్ బేకింగ్ సోడాను చల్లాలి. కొద్దిగా వేడినీరు పోసి పదినిమిషాలు అలాగే ఉంచి లోపలి భాగం పూర్తిగా శుభ్రం చేయాలి.

ఇలా చేయడం వల్ల బాటిల్లోని బ్యాక్టీరియా పోయి వాసన తగ్గుతుంది.

వీటిని శుభ్రం చేయడానికి వేడినీటిని ఉపయోగించడం కూడా చేయకూడదు. వాక్యూమ్ సీల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.