దుప్పటి నిండా కప్పుకుని నిద్ర పోతే ప్రమాదమా?

చలి కాలంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది దుప్పటి కప్పుకుని పడుకుంటారు.

కొంత మంది కేవలం నడుము వరకు కప్పుకుంటే.. మరికొంత మంది ముఖం నుంచి కాళ్ల వరకు మొత్తం శరీరం కప్పుకుని పడుకుంటారు..

 ఇలా ముఖం కూడా కనిపించకుండా పై నుంచి కింద దాకా దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పాడవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దుప్పటి ఫేస్ నుంచి కాళ్ల వరకు కవర్ చేసుకుని నిద్రించడం వల్ల చర్మానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

 ఊపిరి అనేది సరిగ్గా ఆడక పోవడం వల్ల ఊపిరి తిత్తులు అనేవి కుంచించుకు పోవడం ప్రారంభం అవుతాయి. తలనొప్పి, ఆస్తమా, వికారం వంటి సమస్యలు పెరుగుతాయి.

గుండెకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల.. గుండె నొప్పి వంటివి రావచ్చు. తల తిరగడం, వికారం వంటి సమస్యలు కూడా రావచ్చు.

  కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లకుండా.. ఆక్సిజన్ రావడానికి రావడానికి మార్గం ఉండదు. దీని వల్ల రక్త ప్రసరణ అనేది సరిగా జరగదు. రక్త ప్రసరణ జరిగేందుకు చాలా సమయం తీసుకుంటుంది.