1 కప్పు మినపగుండ్లకు రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి.

ఇడ్లీ రవ్వను నాలుగు గంటలు, మినపగుండ్లను రెండు గంటలు నానబెట్టాలి.

అంతకంటే ఎక్కువ సమయం వాటిని నాననిస్తే అనుకున్న విధంగా ఇడ్లీలు రావు.

మినపగుండ్లను నానబెట్టేటప్పుడు అందులో కొన్ని మెంతులు కూడా వేయాలి.

నానిన మినపగుండ్లను గ్రైండర్‌లో వేసేటప్పుడు చల్లటి నీళ్లు పోస్తే పిండి వేడెక్కకుండా మెత్తగా నురుగులా వస్తుంది.

దీనిలో ఇడ్లీ రవ్వ వేసి చేత్తో కలిపితే పిండి బాగా పొంగి ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

ఇడ్లీలు వేసేటప్పుడు పిండిని ఎక్కువగా కలపకూడదు. అలా కలిపితే ఇడ్లీలు పొంగడానికి అవసరమైన గాలి బుడగలు మాయమవుతాయి.

ఇడ్లీలను పది నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించకూడదు.

స్టవ్‌ మీద నుంచి ఇడ్లీ కుక్కర్‌ను దించిన మూడు నిమిషాల తరువాతనే ఇడ్లీలను రేకుల నుంచి పళ్లెంలోకి తీయాలి.