ఎక్కువ టూత్‌పేస్ట్‌తో
పళ్లు తోముతున్నారా..
పళ్లు తోముకోవడానికి సరైన టూత్‌పేస్ట్ మోతాదు గురించి చాలా మందికి తెలియదు.
ఎక్కువ టూత్‌పేస్ట్ వేసుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు
టూత్‌పేస్ట్ అధికంగా వాడితే దంతాలు తెల్లతెల్లగా మెరిసిపోతాయని భావిస్తుంటే అది అపోహే.
వయసును బట్టి ప్రతి ఒక్కరూ సరైన పరిమాణంలో టూత్‌పేస్ట్ వినియోగించాలి. లేకపోతే నోట్లో లేనిపోని సమస్యలు రావడం పక్కా.
డెంటిస్ట్‌ల ప్రకారం, బ్రష్‌కు బఠానీ పరిమాణంలో టూత్‌పేస్ట్‌ను పూస్తే సరిపోతుంది. దంతాలను బాగా శుభ్రం చేయడానికి ఈ మొత్తం సరిపోతుంది.
చిన్న పిల్లలకు 3 సంవత్సరాల లోపు పిల్లలకు కేవలం బియ్యం గింజ పరిమాణంలో మాత్రమే పేస్ట్ వాడాలి. దీనివల్ల దంతాలకు తగిన రక్షణ లభిస్తుంది.
దంతాలను బలోపేతం చేయడానికి టూత్‌పేస్ట్‌లో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. దీన్ని అధికంగా వాడితే నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది
నోటి ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ముందుగా దంతవైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
లేట్‌గా పడుకుంటే.. ఈ సమస్యలు తప్పవు..
శీతాకాలంలో ప్రతి రోజూ అరటిపండు తినొచ్చా?
శీతాకాలంలో ఇలా చేస్తే మడమలు మృదువుగా మారుతాయి!
చుండ్రు సమస్య వేధిస్తోందా.. ఇలా క్లియర్ చేసుకోండి..