లేట్‌గా పడుకుంటే..
ఈ సమస్యలు తప్పవు..
రోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మూడ్ స్వింగ్స్, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం, చిరాకు మొదలైన మానసిక సమస్యలు వస్తాయి.
నిద్ర సరిపోకపోవడం వల్ల చర్మ సమస్యలు, నల్ల మచ్చలు, త్వరగా వృద్ధాప్యానికి చేరుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
లేట్‌గా నిద్రపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్, హృదయ సంబంధ సమస్యలు రావచ్చని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
నిద్ర సరిపోకపోతే హార్మోన్ల అసమతుల్యత మొదలవుతుంది. ఒత్తిడిని నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది.
నిద్ర లేమి వల్ల గ్రెలిన్, లెప్టిన్ వంటి ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. హై క్యాలరీ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది.
నిద్ర సరిపోకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు దండెత్తుతాయి.
కొందరిలో నిద్రలేమి డిప్రెషన్‌కు కూడా కారణమవుతుంది. మానసిక సమస్యలు మొదలవుతాయి.
Related Web Stories
శీతాకాలంలో ప్రతి రోజూ అరటిపండు తినొచ్చా?
శీతాకాలంలో ఇలా చేస్తే మడమలు మృదువుగా మారుతాయి!
చుండ్రు సమస్య వేధిస్తోందా.. ఇలా క్లియర్ చేసుకోండి..
ఇడ్లీ vs దోశ.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ ఛాయిస్..!