ఇడ్లీ vs దోశ.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ ఛాయిస్..!
ఈరోజుల్లో జనాలు డైట్ పేరుతో రాత్రి పూట భోజనం చెయ్యడం స్కిప్ చేస్తున్నారు.. దాంతో అందరు టిఫిన్స్, లేదా ఫ్రూట్స్ తింటున్నారు.. ఎక్కువమంది దోస, ఇడ్లీ వంటివాటిని తింటుంటారు..
ఆవిరిపై ఉడికించిన ఇడ్లీ మెత్త మెత్తగా.. తెల్లగా మల్లెపువ్వులా మెరిసిపోతే.. ఇందుకు భిన్నంగా పెనంపై నూనెతో కాల్చిన దోశలు క్రిస్పీగా, కలర్‌ఫుల్ గా నోరూరిస్తూ ఉంటాయి.
ఇడ్లీలు సులభంగా జీర్ణమవుతాయి. ఇవి తేలికపాటి అల్పాహారానికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యాయామం తర్వాత తినేందుకు బెస్ట్ ఫుడ్.
ఇడ్లీ, దోశ.. రెండింటి పిండీ పులియబెడతాం. దీనివల్ల ప్రోబయోటిక్స్ తయారవుతాయి. ఈ ప్రోబయోటిక్స్ మీ జీర్ణవ్యవస్థని సూపర్ హెల్తీగా ఉంచుతాయి.
ఇడ్లీ, దోశల్లో ఏది ఎంచుకోవాలనే ప్రశ్న వస్తే, అది ఆయా వ్యక్తుల ఆరోగ్యకర స్థితి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.
కడుపుకు మృదువుగా ఉండే తేలికైన, తక్కువ కొవ్వు భోజనం కోసం చూస్తున్నట్లయితే ఇడ్లీ తినడం మంచిది. అలాకాక, కడుపు నిండిన అనుభూతి, రుచి రెండూ కావాలని కోరుకునేవారికి తక్కువ నూనెతో చేసిన దోశ బెస్ట్ ఛాయిస్.
అధిక నూనెలతో తయారైన దోశలు ఆరోగ్యానికి ఏ మాత్రం లాభం చేకూర్చవని గుర్తుంచుకోవాలి. ఇక ఇడ్లీ లేదా దోశ రెండూ మితంగా తీసుకుంటే బరువు తగ్గించుకునేందుకు కచ్చితంగా ఉపయోగపడతాయి.