చుండ్రు సమస్య వేధిస్తోందా.. ఇలా క్లియర్ చేసుకోండి..
ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు కారణంగా తలపై దురద, చికాకు కలుగుతుంది.
ఎన్ని రకాల సంపూలు వాడిన చుండ్రు సమస్య అస్సలు తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలతోనే ఈ సమస్యలు దూరం చేయవచ్చు.
కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి మీ తలకు మసాజ్ చేయండి. తలస్నానం చేయడానికి ముందు 20 నిమిషాలు అలాగే ఉంచండి.
ఇలా వారానికి రెండుసార్లు కొన్ని రోజుల పాటు చేస్తే చాలు చుండ్రు సమస్య దూరం అవుతుంది.
మెంతులను నానబెట్టి, పేస్ట్‌లా చేసుకుని, తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దురద, పొట్టు తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.
పెరుగులో నిమ్మరసం కలిపి తలకు రాసుకోవాలి. కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది.
ఎవరికీ వారు వేర్వేరుగా దువ్వెనలు వాడడం అలవాటు చేసుకోవాలి.