వాటర్ హీటర్ వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే పెద్ద ప్రమాదం!
చలికాలంలో ఉదయం లేవగానే వేడి నీళ్లు తప్పనిసరి. నీళ్లు వేడి చేయడానికి హీటర్లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
హీటర్‌ను వాడేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం.
హీటర్ వాడేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. నీరు విద్యుత్‌ను సులభంగా ప్రసరించేలా చేస్తుంది కాబట్టి..
తడి చేతులతో హీటర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడం చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు.
చాలామంది చేసే మరో రిస్క్ ఏంటంటే.. ఇనుప బకెట్‌లో హీటర్‌ను ఉపయోగించడం. ఇనుము కూడా కరెంట్‌ను ఈజీగా పట్టేస్తుంది. కాబట్టి షాక్ కొట్టే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఎల్లప్పుడూ ప్లాస్టిక్ బకెట్‌నే వాడండి. అదే సురక్షితం.
నీళ్లు వేడెక్కిన తర్వాత కూడా రాడ్‌ను బకెట్‌లో అలాగే ఉంచేయకండి. ఇలా చేస్తే కరెంట్ వేస్ట్ అవుతుంది. అంతేకాదు రాడ్‌కు తుప్పు పట్టి త్వరగా పాడైపోతుంది.
బకెట్‌లో నీళ్లు చాలా తక్కువగా ఉంటే రాడ్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది.కాబట్టి నీళ్లు ఎక్కువ - తక్కువ ఉండొద్దు